మాజీ సర్పంచ్ ఈశ్వరయ్యకు ఘన నివాళి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తండ్రి, మల్కాపురం గ్రామ మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య దశదిన కర్మ కార్యక్రమం బుధవారం జహీరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అర్జున్ ఖేల్ అవార్డు గ్రహీత, వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏర్పుల నరోత్తంతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన గ్రామాభివృద్ధికి అందించిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈశ్వరయ్య మరణం పార్టీకి, గ్రామ ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని ఈశ్వరయ్యకు నివాళులర్పించారు.