Temple | అన్న ప్రసాద వితరణ…

Temple | అన్న ప్రసాద వితరణ…

Temple | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప స్వామికి అన్న ప్రసాద నైవేద్యమును సమర్పించారు.

అనంతరం ఈ రోజు నుండి 2026 జనవరి 11వ తేదీ వరకు అయ్యప్ప దీక్షపరులకు నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో చేపట్టగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) చేతుల మీదుగా అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ రోజు దేవాలయంలో చెవ్వగొని వెంకటేష్ గౌడ్(Venkatesh Goud) దంపతులు వారి కుమార్తె భవ్య శ్రీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెల్గ రాజశేఖర్ రెడ్డి(Velga Rajasekhar Reddy), మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, దేవాలయ కమిటీ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ స్వామి, నాయకులు తిరుపతి రవీందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply