బాలికలు అన్ని రంగాలలో రాణించాలి
బాలికలు అన్ని రంగాలలో రాణించాలి
- బాలల రక్షణ భద్రత కార్యక్రమంలో తహసిల్దార్ వసంతరావు
చిట్యాల, ఆంధ్రప్రభ : బాలికలు ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకొని అన్ని రంగాల్లో రాణించాలని చిట్యాల తహసీల్దార్ వసంతరావు సూచించారు. బాలికలకు చదువు ఒక్కటే శక్తివంతమైన ఆయుధమని, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు మానుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం మండలంలోని జూకల్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘99 రోజుల ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా బాలల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వసంతరావు, చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళా శక్తి కేంద్రం ఇంచార్జ్ బి. మమత మాట్లాడుతూ, 11 నుంచి 18 సంవత్సరాల బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టపరమైన రక్షణల గురించి వివరించారు. అనంతరం వాల్ పోస్టర్లు ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ రాకేష్, గ్రామ సర్పంచ్ ఎలగొండ సంధ్యారాణి, ఉపసర్పంచ్ అనిల్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు కరుణాదేవి, అరుణ, విజయలక్ష్మి, సరిత, మమత, ఏఎన్ఎం సంధ్యారాణి, కిశోర బాలికలు పాల్గొన్నారు.
