తెలంగాణ నిర్మాణానికి జయశంకర్ ఆశయాలే స్ఫూర్తి
సూర్యాపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలతో తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు కిరణ్‌కుమార్, కుంచం చంద్రకాంత్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం సూర్యాపేటలోని తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు, ఆకాంక్షల సాధన దిశగా ప్రజలు ముందుకు సాగాలని, జయశంకర్ చూపిన మార్గమే తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిట్టల మురళి, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
