బషీరాబాద్‌లో సీసీటీవీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం

బషీరాబాద్‌లో సీసీటీవీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం

కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : “మన ఊరు – మన భద్రత, మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి ఎస్సై జి. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జి. మధుకర్ గ్రామస్థులకు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. సీసీటీవీ వ్యవస్థలు 24 గంటల పర్యవేక్షణ ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడంలో, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తాయని తెలిపారు.

గ్రామ ప్రజలు తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply