దుర్గగుడికి రూ.2 లక్షలకు పైగా విరాళాలు

దుర్గగుడికి రూ.2 లక్షలకు పైగా విరాళాలు
అన్నదానం, ఉచిత ప్రసాద పథకాలకు భక్తుల ఆర్థిక సహాయం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని సేవా కార్యక్రమాలకు భక్తులు ఉదారంగా విరాళాలు అందజేస్తున్నారు. ఆదివారం ఇద్దరు దాతలు వివిధ పథకాల కోసం రూ.2 లక్షలకు పైగా విరాళాలను దేవస్థాన అధికారులకు అందజేశారు. సికింద్రాబాద్‌లోని వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివాని దంపతులు దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి రూ.1,00,000 విరాళంగా సమర్పించారు.
అదే విధంగా విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి దంపతులు నిత్య ఉచిత ప్రసాదం పంపిణీ పథకానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం నిర్వహించి, ప్రధానాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదం, విరాళాల రసీదులను అందజేశారు.
