TDP| టీడీపీ నేత మృతి

TDP| కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు టీడీపీ నేత సింగం సుబ్రహ్మణ్యం (బాపిచ్చ) గురువారం గుండె పోటుకు గురై శాస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహానికి కోడూరు మండల టీడీపీ నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అంకితభావంతో పని చేసిన సుబ్రహ్మణ్యం మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. మాజీ ఎంపీపీ మాచర్ల భీమయ్య, పిల్లి మల్లిఖార్జునరావు, కవకోల్లు నాంచారమ్మ, కొక్కిలి గడ్డ జాన్ విల్సన్, పరిశే నాగ మల్లేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a Reply