JOURNEY | పొగ మంచులో ప్రయాణం జాగ్ర‌త్త‌…

JOURNEY | పొగ మంచులో ప్రయాణం జాగ్ర‌త్త‌…

  • పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం
  • ప్ర‌మాదాలు జరిగే అవకాశం.. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు
  • పరిమితవేగంతో ప్రాణాలకు రక్షణ

సంగారెడ్డి రూర‌ల్ ఎస్సై మధుసూధన్ రెడ్డి

JOURNEY | సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : దట్టమైన‌ పొగ మంచుతో జాగ్ర‌త్తగా ప్ర‌యాణించాల‌ని, పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరమ‌ని సంగారెడ్డి రూర‌ల్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ మధుసూధన్ (Sub-Inspector Madhusudhan) రెడ్డి అన్నారు. జాతీయ ర‌హ‌దారి 161 వెళ్లే వాహన దారులు రాత్రి 1 గంట నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రయాణాలను పొగ మంచు ఎక్కువగా ఉండటం వల్ల వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని అన్నారు. పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రాణాలకు రక్షణ ఉంటుందని తెలియజేశారు. చ‌లికాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడున్నాయ‌ని చెప్పారు. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వాహనాలకు లైట్లు వేసుకున్నా.. కొంత దూరంలో ఉన్న వాహనాలు కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించవని, వేగంగా ప్రయాణిస్తే ప్ర‌మాదాలు జరిగే అవకాశం ఉంద‌న్నారు. హెడ్‌లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాలని, అత్యవసరమైతే తప్ప, రాత్రులలో, పొగమంచు తీవ్రంగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండాలని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సెట్ బెల్ట్ ధరించాల‌ని సూచించారు.