t20| ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన‌ భార‌త్

t20| ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన‌ భార‌త్

వ‌రుస‌గా రెండో సారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టేసింది
అనే రికార్డుల‌ను సొంతం చేసుకున్న టీమిండియా

  • ఈ టోర్నీలో భారత్ ఏకంగా 106 సిక్సర్లు బాదింది.
  • టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు ఇన్ని సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి.
  • ఫైన‌ల్ మ్యాచ్ పవర్​ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసి వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది.
  • మొద‌టి 4 ఓవర్లలోనే జట్టు యాభై పరుగుల మార్కును భార‌త్ చేరుకుంది.
  • టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచులలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నెలకొల్పింది.
  • అక్కడితో ఆగకుండా, కేవలం 44 బంతుల్లోనే (7.2 ఓవర్లలో) జట్టు సెంచరీ పూర్తి చేసింది.
  • దీంతో నాకౌట్ మ్యాచులలో వేగవంతమైన వంద పరుగుల రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.
  • ఈ టోర్నీలో భారత్ ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించింది.
  • ఒకే ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది.
  • ఈ వరల్డ్ కప్​లో సంజు శాంసన్ 321 పరుగులు చేశాడు.
  • ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
  • గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సంజు అధిగమించాడు.
  • ఫైనల్ మ్యాచులో 89 పరుగులు చేసిన సంజు, వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా మార్లన్ శామ్యూల్స్ (85) రికార్డును చెరిపివేశారు.
  • ఫైనల్​లో న్యూజిలాండ్​పై 96 పరుగుల తేడాతో గెలిచింది.
  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
  • భారత జట్టు ఈ విజయంతో తన మూడవ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
  • ప్రపంచంలో మూడు సార్లు ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించింది.
  • 2024లో టైటిల్ గెలిచిన భారత్, ఇప్పుడు మళ్లీ గెలిచి టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా రెండుసార్లు టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.
  • సొంత గడ్డపై ఆడుతూ ప్రపంచకప్ గెలిచిన మొట్టమొదటి ఆతిథ్య దేశంగా కూడా భారత్ ట్రెండ్ సెట్ చేసింది.