Rajasaab vs Jana Nayagan | ప్రభాస్ వెర్సెస్ విజయ్..

Rajasaab vs Jana Nayagan | నువ్వా..? నేనా..?

Rajasab vs Jana Nayagan | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. దీనికి మారుతి డైరెక్టర్. హర్రర్ జోనర్ లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్(Promotional content audience) లో మరింత బజ్ క్రియేట్ చేసింది. జనవరి 9న ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్. దీనికి హెచ్ వినోద్ డైరెక్టర్. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా పై మరింతగా హైప్ క్రియేట్(Create hype) చేసింది. ఈ సినిమా కూడా జనవరి 9న రాబోతుంది. మరి.. ఒకే డేట్ లో వస్తున్న రాజాసాబ్, జన నాయగన్.. ఈ రెండింటిలో బాక్సాఫీస్ దగ్గర గెలిచేది ఎవరు..?

Rajasaab vs Jana Nayagan | ది రాజాసాబ్ వేరే లెవల్..

Rajasaab vs Jana Nayagan

ది రాజాసాబ్ మూవీలో.. ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తున్నారు మారుతి. గ్లింప్స్ అండ్ టీజర్(Glimpses and Teasers) లో.. ప్రభాస్ లుక్, స్టైల్ వేరే లెవల్లో ఉండడంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ప్రభాస్ తర్వాత సంజయ్ దత్ క్యారెక్టర్ గురించి ఎక్కువుగా మాట్లాడుకుంటారని డైరెక్టర్ మారుతి తెలియచేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందేమో అనే పుకార్లకు చెక్ పెడుతూ.. నిర్మాత విశ్వప్రసాద్ జనవరి 9న ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాసాబ్ రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Rajasaab vs Jana Nayagan | జన నాయగన్ ని క్రాస్ చేసి రాజాసాబ్..

Rajasaab vs Jana Nayagan

ఓవర్ సీస్ లో ఈ మూవీ అడ్వాన్స్ టిక్కెట్స్ ఓపెన్ చేస్తే.. టిక్కెట్ సేల్స్ లో రికార్డులు దిశగా దూసుకెళుతుంది. 319 లోకేషన్స్ లో రాజాసాబ్ అడ్వాన్స్ టిక్కెట్ సేల్స్ స్టార్ట్ చేస్తే.. రోజురోజుకు మరింతగా సేల్స్ పెరుగుతున్నాయి. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాజాసాబ్ $136K డాలర్లు కలెక్ట్ చేసింది. 4,699 టిక్కెట్లు సేల్ అయ్యాయి. ఇక విజయ్ జననాయగన్ విషయానికి వస్తే.. ఇప్పటి వరుకు అడ్వాన్స్ టిక్కెట్స్ లో $41.9K కలెక్ట్ చేసింది. 2037 టిక్కెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తే.. రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళుతుంది.

Rajasaab vs Jana Nayagan | విజయ్ ఆఖరి సినిమా..

Rajasaab vs Jana Nayagan

జన నాయగన్.. ఇది కోలీవుడ్ స్టార్ విజయ్(Kollywood star Vijay) ఆఖరి సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు కీలక పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ గ్రాండ్ గా జన నాయగన్ ను రూపొందిస్తున్నారు. అయితే.. ఇది విజయ్ ఆఖరి సినిమా కావడంతో కోలీవుడ్ లో భారీగా క్రేజ్(Huge craze) ఉంది. తెలుగులో కూడా బాగానే బజ్ ఉంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Rajasaab vs Jana Nayagan | భారీగా బజ్ రాజాసాబ్ కే..

Rajasaab vs Jana Nayagan

ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది.. ఏ సినిమా నయా రికార్డులు(naya records) సెట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. విజయ్ తమిళనాడుకే పరిమితం అయ్యాడు. తెలుగులో ఈమధ్య విజయ్ సినిమాలు రిలీజ్ చేయడం వలన మార్కెట్ క్రియేట్(Create a market) అయ్యింది. అందుచేత ప్రభాస్, విజయ్ ఈ ఇద్దరిలో ఎక్కువ క్రేజ్ ఉంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కే. పైగా రాజాసాబ్ మూవీ జనాలకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. జన నాయగన్.. బాలయ్య భగవంత్ కేసరి మూవీ ఆధారంగా రూపొందింది. అడ్వాన్స్ బుకింగ్స్(Advance bookings) లో బజ్ ఎక్కువుగా రాజాసాబ్ కు ఉన్న విషయం క్లియర్ గా తెలుస్తుంది. అందుచేత.. జనవరి 9న జరిగే బాక్సాఫీస్ పోటీలో రాజాసాబ్ మూవీకే విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. మరి.. చూడాలి ఏం జరగనుందో..?

CLICK HERE TO READ అక్కినేని హీరోల ఆశలన్నీ..

CLICK HERE TO READ MORE

Leave a Reply