స్వాములవారి లింగోటంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామం ఉదయగిరి కాలనీలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను శుక్రవారం గ్రామ సర్పంచ్ బీమిడి ప్రదీప్ జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రదీప్ మాట్లాడుతూ… సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో, వారి సహకారంతో రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని మునుముందు కూడా నూటికి నూరు శాతం నెరవేరుస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల తాగునీటి ఇబ్బందులను దూరం చేసేందుకు ఈ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చి, ఆర్థికంగా సహకరించిన ‘సూర్య ఆగ్రో ఫామ్స్’ యాజమాన్యానికి గ్రామ ప్రజల తరపున సర్పంచ్ ప్రదీప్ జీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాతరాజు ధనుంజయ్య, స్థానిక వార్డు మెంబెర్ రాదారపు సత్తయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య, దేవస్థానం చైర్మన్ కుర్నాల వెంకటేష్, కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు చేవెళ్లి కృష్ణ, యూత్ అధ్యక్షులు చొప్పరి సాయి కుమార్, మండల కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి ఎర్ర విక్రమ్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబెర్ గంగాపురం నరహరి, మాజీ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్, గ్రామ ప్రముఖులు ఆకుల మధు, ఆకుల శ్రీనివాస్, ఆకుల రవి, ఉప్పు వీరయ్య, ఉప్పు నర్సింహా, ఉప్పు చిన్ని కృష్ణ, పిట్టల సదానందం, ఢిల్లీ జనార్దన్ రెడ్డి, బాతరాజు నాగయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
