ఎస్‌ఐఆర్ ప్రక్రియ పరిశీలించిన..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్ శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలు కూడా అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బస్వరాజ్, పంచాయతీ కార్యదర్శి సుమన్ రెడ్డి, బి ఎల్ వో తదితరులు పాల్గొన్నారు.
