హామీల అమలుకోసం సమ్మె బాట

బోధన్, ఆంధ్రప్రభ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) వీఓఏలు సోమవారం నుంచి సమ్మె చేపట్టారు.
ఈ సందర్భంగా వీఓఏల సంఘం బోధన్ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఓఏలను కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా నియమించాలని కోరారు.
వీఓఏలకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, జీఓ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
