Stock | 7 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి…

Stock | 7 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి…

Stock | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 336 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25,500 దిగువన ముగిసింది. 7 ల‌క్ష‌ల కోట్లు ఆవిర‌య్యాయి.

సెన్సెక్స్‌ 1048.16 పాయింట్లు నష్టంతో 82,626.76 వద్ద, నిఫ్టీ 336.10 పాయింట్లు నష్టపోయి 25,471.10 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 90.66గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ నష్టపోయాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎటెర్నెల్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 67 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4977 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply