ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

కొండపి, ఆంధ్రప్రభ: కొండపి నియోజకవర్గంలోని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతులను స్వీకరించినట్లు మంత్రి శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి తెలిపారు.

క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి వివరాలను తెలుసుకున్న అనంతరం ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.

ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.