జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో మూలపాడు విద్యార్థుల సత్తా

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో మూలపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. టి.సాయివర్ధన్, వి.సుధీర్, ఎన్.హెచ్.నారాయణ మూర్తి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాగా, కె.హర్షవర్ధన్, ఆర్.నిఖిల్, ఎన్.కళ్యాణ్, బి.శ్రీ నిషిద్ నాయక్ వారి కేటగిరీలో రెండో స్థానంలో నిలిచారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ రాక్ ఫిల్లర్, వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ ఇచ్చిన పీడీ ఎస్.కె.రషీద్, వహీదా బేగం అభినందించారు. సహాయ సహకారాలు అందించిన వీకే అకాడమికి కృతజ్ఞతలు తెలిపారు.