సేవా మార్గంలో అందరి చెంతకు విశ్వ హిందూ పరిషత్..
నంద్యాల రూరల్, ఆంధ్రప్రభ : విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెలా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల అరుంధతి నగర్ లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్టు జగజ్జనని ప్రఖండ అధ్యక్షులు సుహాసిని రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సేవలు అందించిన డా: నీలా ప్రసాద్ యాదవ్ (లక్ష్మి ప్రియ గ్యాస్ట్రో సర్జికల్స్), డా: క్రాంతి కిరణ్ గార్లను (కిరణ్ ఆర్థోపెడిక్ సెంటర్) ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి నంద్యాల బ్లడ్ సెంటర్ అధినేత అచ్చు లను నగర సేవా విభాగం సభ్యులు సన్మానించారు.
ఈ ఉచిత మెగా వైద్య శిబిరం లో 150 మంది వైద్య సేవను పొందారని , వైద్య సేవతో పాటు. యువతి యువకులకు అవసరమైన ఉపాధికి సంబంధించిన శిక్షణను ఇవ్వటానికి కూడా విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ప్రయత్నాలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి నాగిరెడ్డి, విశేష సంపర్క ప్రముఖ్ శేషసాయి, డా. లలిత సరస్వతీ, అరుణ, సుకుమాంబ, సేవా విభాగం సభ్యులు గురవయ్య ,శివ శంకర్ రెడ్డి, ఆదినారాయణ, చింతలపల్లి వాసు, మురళీధర్ రెడ్డి, నరసింహ, లక్ష్మీ నరసింహ, రవి, గౌతమ్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
