Social Media | ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Social Media | ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Social Media | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఒడిశాలోని పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యాన్ని పేల్చివేస్తామ‌ని సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆల‌య ప‌రిస‌రాల్లో ఇవాళ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఆ పోస్టు క‌నిపించింది. ఆల‌యాన్ని పేల్చ‌డంతో పాటు బీజేడీ రాజ్య‌స‌భ ఎంపీ సుభాషిస్ కుంతియాను అటాక్ చేస్తామ‌ని కూడా ఆ పోస్టులో హెచ్చ‌రించారు.

షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా పేల్చివేస్తామ‌న్నారు. అయితే ఆ సోష‌ల్ మీడియా పోస్టు కోసం ఓ మ‌హిళ అకౌంట్‌ను వాడుకున్నారు. ఆమె పేరుతో ఓ గుర్తు తెలియని వ్య‌క్తి ఫేక్ యూజ‌ర్ ఐడీని క్రియేట్ చేసి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. పూరి సైబ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. బాంబు బెదిరింపు నేప‌థ్యంలో జ‌గ‌న్నాథుడి ఆల‌య ప‌రిస‌రాల చుట్టూ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు పోలీసు అధికారి వెల్ల‌డించారు.

Leave a Reply