SMRUTI MANDANA |వాళ్లిద్దరూ ఒక్కటవుతున్నారు..

సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లి
నేడు స్మృతి స్వస్థలం సాంగ్లీలో జరగనున్న వివాహ వేడుక
SMRUTI MANDANA | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వివాహం నేడు జరగనుంది. తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ అయిన పలాశ్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. మహారాష్ట్రలోని స్మృతి స్వస్థలమైన సాంగ్లీలో నవంబర్ 23, 2025న మధ్యాహ్నం వీరి పెళ్లి వేడుక జరగనుంది.

ప్రేమ కథ మొదలైందిలా..
స్మృతి, పలాశ్‌ల ప్రేమకథ 2019లో ప్రారంభమైంది. అయితే, తమ కెరీర్‌లపై దృష్టి పెట్టేందుకు ఇన్నేళ్లుగా తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది జులైలో తమ ఐదేళ్ల ప్రేమకు గుర్తుగా సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రపంచకప్ గెలిచిన తర్వాత, ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పిచ్‌పైకి తీసుకెళ్లిన పలాశ్, ఆమెకు ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతకుముందే, పలాశ్ తన చేతిపై స్మృతి జెర్సీ నంబర్ ‘SM18’ అని పచ్చబొట్టు వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.
