GT vs MI | గుజ‌రాత్ ఆల్రౌండ్ పర్ఫామెన్స్.. ఖాతా తెరిచిన టైట‌న్స్ !

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ముంబై తో జ‌రిగిన మ్యాచ్ లో గుజ‌రాత్ టైట‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. గుజార‌త్ జ‌ట్టు నిర్ధేశించిన 198 ప‌రుగ‌ల ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్.. 00 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో శుభ‌మ‌న్ గిల్ సార‌థ్యంలో గుజరాత్ టైట‌న్స్.. 00 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం సాధించింది.

ఈ విజ‌యంతో టోర్నీలో ఖాతా తెరిచిన టైటన్స్‌.. టోర్నీలో ఒక అడుగు ముందుకు వేసింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న గుజరాత్ ఒక్కసారిగా 6 స్థానాలు ఎగ‌బాకి 3వ స్థానానికి చేరింది. మరోవైపు 8వ స్థానంలో ఉన్న ముంబై ఈ ఓటమితో 9వ స్థానానికి పడిపోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన‌ గుజరాత్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 197 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా గుజరాత్ జట్టు రాణించి ఆల్ రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను చేజిక్కుంచుకంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (2/18), మహ్మద్ సిరాజ్ (2/34), సాయి కోషోర్ (1/37), కగిసో రబడ (1/42) వికెట్లు తీశారు.

అయితే 198 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48), తిలక్ వర్మ (39) తప్ప, కీలక బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆఖ‌ర్లో వ‌చ్చిన న‌మ‌న్ ధీర్ (18), మిచెల్ శాంట్న‌ర్ (18) ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.

ఇక అంత‌క‌ముందు గుజ‌రాత్ బ్యాటింగ్ లో యంగ్ స్టార్స్ సాయి సుదర్శ‌న్ (41 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సుల‌తో 63) సూప‌ర్ స్ట్రైకింగ్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ (38), జోస్ బ‌ట్ల‌ర్ (39) రాణించారు. ఇక ఆఖ‌ర్లో వ‌చ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (18), రషీద్ ఖాన్ (6), కగిసో రబడ (7) సిక్సులతో మెప్పించారు. దీంతో గుజ‌రాత్ స్కోర్ 197 గా న‌మోదైంది.

ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు తలా ఒక వికెట్ తీయ‌గా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు.

Leave a Reply