బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

సారంగాపూర్ గ్రామంలో మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు

కడెం, ఆంధ్రప్రభ: ఇటీవల కడెం మండలం సారంగాపూర్ గ్రామంలో సందు రాజేశ్వర్, ఆయన కుమారుడు సందు వినీత్ మృతి చెందిన ఘటనపై స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బుధవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు.

మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఈ విషాద ఘటన పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ మరియు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, సారంగాపూర్ గ్రామ సర్పంచ్ కోలా తేజస్విని శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికె మల్లేష్ యాదవ్, ఉపసర్పంచ్ కుమ్మరి రమేష్, కాంగ్రెస్ నాయకులు కుమ్మరి సుధాకర్, మార్గపు లక్ష్మణ్, కోలా చిన్ని నరసయ్య, బొజ్జ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.