రైతుల రక్తాన్ని పొలాల్లో చల్లాలా?

  • ముఖ్యమంత్రి సోయి ఉండే మాట్లాడుతున్నారా?
  • తక్షణమే తన వాఖ్యాల్ని వెనక్కి తీసుకోవాలి
  • మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి
  • నాలుగు లైన్ల రోడ్డుకు ఎన్నోసార్లు శంఖుస్థాపన చేస్తారు
  • ఇప్పుడున్న చెట్లను తొలగించకుండా రోడ్డు వేయాలి

మక్తల్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. రైతుల రక్తాన్ని పొలాల్లో చల్లాలా? ఇంతక ముఖ్యమంత్రి సోయి ఉండే మాట్లాడుతున్నారా? తక్షణమే తన వాఖ్యాల్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం సాయంత్రం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి, రైతాంగ సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.

రైతులకి సాగు నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించగా ఏముంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రైతుల రక్తాన్ని పొలాలలో చల్లితే పొలాలు పంటలు పండుతాయి అని చెప్పి అనటం చూస్తుంటే ఇంతకూ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారా లేదా? అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హుందాతనం, సంయమనం పాటిస్తూ మాట్లాడాల్సిన బాధ్యత ఉందని, ప్రజలను రెచ్చగొట్టేలా లేదా రాజకీయ విద్వేషాలను పెంచేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి తన వాఖ్యాల్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వర్షాలు లేక లేక బోర్ల కింద నాట్లు వేసుకుందాం అన్న కరెంటు సమస్యతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గంట గంటకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల పొలాలకు నీరు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుండి నీటిని విడుదల చేయించాలన్న సోయి కూడా ముఖ్యమంత్రితో పాటు స్థానిక మత్రికి కూడా లేకపోవడం విడ్డూరమని అన్నారు.

రైతుల కష్టాలు వీరికి ఏమాత్రం పట్టడం లేదని వారి ఆర్భాటాలు ప్రచారాలు తప్ప మరేమీ పట్టడం లేదన్నారు. రైతుల పట్ల చిన్న చూపు చూడడం ఇకనైనా మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం హితవు పలికారు. రైతుల ఉసురు పోసుకున్న వారు ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లెదన్నది గుర్తుంచుకోవాలని అన్నారు .

అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ రైతులకు అందించిన చరిత్ర తమదేనని అన్నారు.ప్రజా పాలనలో రైతు కష్టాలు వర్ణనాతీతమణి అన్నారు. నాలుగు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నారని ఆ సమయంలోను అనేకసార్లు కరెంటు వచ్చి పోతుందని దీంతో రైతులను ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు.

రైతుబంధు రైతు బీమా గురించి మాట్లాడుకోవడం కూడా వ్యర్థమే అన్న విధంగా తయారయింది అన్నారు .ప్రభుత్వం అభివృద్ధి చేస్తే తాము హర్షిస్తామే తప్ప తప్పు పొట్టబోమని అన్నారు. కానీ అభివృద్ధి కన్నా వారి గొప్పలు ప్రచారం చేసుకోవడానికి మంత్రులకు సమయం సరిపోవడం లేదని అన్నారు.

మక్తల్ నుండి నారాయణపేటకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని మాజీ ఎమ్మెల్యే చట్టం రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే అదే పనులను ఈనెల 10న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి మరోసారి శంకుస్థాపన చేయడం ప్రజలను మభ్య పెట్టడమే తప్ప పనులు చేసే ధ్యాస వారికి లేదని అన్నారు.

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి మంత్రులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు .అయితే రోడ్డు నిర్మాణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు నష్టం వాటిల్లకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సూచించారు .భూసేకరణలో రోడ్డుకు ఇరువైపులా కాకుండా ఒకేవైపు భూసేకరణ చేయడం ద్వారా ప్రస్తుతం రోడ్డుకు ఉన్న చెట్లకు నష్టం వాటిల్లకుండా చూడవచ్చని గుర్తు చేశారు. నిర్ణీత సమయంలోగా నాలుగు లైన్ల రహదారిని పూర్తిచేయాలని ఆయన కోరారు .ఈ విలేఖరుల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, గుర్లపల్లి సర్పంచ్ గాల్ రెడ్డి, నాయకులు ఈశ్వర్ యాదవ్, జౄ. సాగర్ ,ఉప్పరి రఘు తదితరులు పాల్గొన్నారు.