kammarpally | పీఎం శ్రీ విజేతలకు బహుమతులు ప్రధానం..
kammarpally | పీఎం శ్రీ విజేతలకు బహుమతులు ప్రధానం..
kammarpally | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాదు జిల్లాలోని పీఎం శ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ పోటీలలో కబడ్డీ విభాగంలో పీఎంశ్రీ జడ్ పి హెచ్ ఎస్ చౌట్ పల్లి పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని పాఠశాల ప్రధనోపాధ్యాయులు, ఎం ఈ వో నేర ఆంధ్రయ్య ఈ రోజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పీడీ నాగేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చి బహుమతులు గెలుపొందడం జరిగిందని అన్నారు. అదేవిదంగా జిల్లా స్థాయిలో జరిగిన స్పెల్ బి, క్విజ్ పోటీలలో సీహెచ్. మధుప్రియ ప్రథమ, ఎస్. ప్రణవిలకి ద్వితీయ స్థానాలు రావడం జరిగిందన్నారు. ఈ విధంగా పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తొడ్పాడుతున్న ఉపాధ్యాయ బృందానికి ఎంఈవో ఆంధ్రయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
