ఎస్.కేపీవీవీ గ్రూపు నూతన స్కూల్ ప్రారంభం

ఎస్.కేపీవీవీ గ్రూపు నూతన స్కూల్ ప్రారంభం

6.5 ఎకరాల ప్రాంగణం
సి.బి.ఎస్. సిలబస్ తో విద్యావిధానం
విద్యార్థి సమగ్ర వికాసానికి పెద్దపీట

విజయవాడ, ఆంధ్రప్రభ : ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ ఎస్.కె.పి.వి.వి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యాసంస్థ ఎస్.కె.పి.వి.వి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్’ ను విద్యాసంవత్సరం (2026-27) నుంచి ప్రారంభిస్తున్నట్లు ‘కమిటీ’ ప్రెసిడెంట్ టి .శేషయ్య చెప్పారు. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టి.శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేనివిధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సి.బి.ఎస్.ఇ కరికులమ్ తో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగినవారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు.

ఐదు ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ‘స్కూల్’ కమిటీ ప్రెసిడెంట్ డోకుపర్తి సుజాత మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే వివిధ నైపుణ్యాల్లో తీర్చిదిద్దేందుకు ‘స్కిల్ ల్యాబ్స్’ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇన్ ఛార్జి సెక్రటరీ డాక్టర్ టి.శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటుచేసామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ప్రిన్సిపాల్ పి.శ్యామల మాట్లాడుతూ ఆర్ట్స్, స్పోర్ట్స్ రంగాల్లో ప్రత్యేక ట్రైనర్స్ ని ఏర్పాటుచేసి, విద్యార్థులకు అన్నిరంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 21వ శతాబ్దపు పౌరుడిగా విద్యార్థులు ఎదిగేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో హైస్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ళ బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply