గీసుగొండ, మార్చి 15 (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల జాతర సమీపంలోని వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతిచెందాడు. సంగెం మండలం పల్లార్ గూడ వి.ఆర్.ఎన్ తండాకు చెందిన వాసరి అరుణ్ కుమార్ మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి, మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.