Sarpanch Elections | కేసు నమోదు..

Sarpanch Elections | కేసు నమోదు..
Sarpanch Elections, నేరడిగొండ, ఆంధ్ర ప్రభ : మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్న ఇరువురు సర్పంచ్ అభ్యర్థులు జితేందర్ సోలంకి, కరణ్ సింగ్ సోలంకీలు ఎనిమిది మంది అనుచరులతో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ విషయం పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా, ఎస్ఐ ఇమ్రాన్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రత సమస్యలు తలెత్తేలా ప్రవర్తించిన వారి పై పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరి పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు 194 (2) బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలియచేశారు.
