Devotees | సంక్రాంతి సెలవులతో తిరుమలలో భక్తుల పోటెత్తు | సర్వదర్శనానికి 14 గంటల నిరీక్షణ

Devotees | సంక్రాంతి సెలవులతో తిరుమలలో భక్తుల పోటెత్తు | సర్వదర్శనానికి 14 గంటల నిరీక్షణ

సర్వదర్శనానికి 14 గంటల నిరీక్షణ

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయిన పరిస్థితి

సుప్రభాత సేవలు పునఃప్రారంభం

ఒక్కరోజులో 76 వేల మంది భక్తుల దర్శనం

హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు

భక్తుల రద్దీపై టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లుDevotees | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సంక్రాంతి పండ‌గ‌కు వ‌రుస‌గా వారం రోజులు సెల‌వులు రావ‌డంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్ (Token) లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానున్నాయి. ధనుర్మాసం కారణంగా నెల రోజుల పాటు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ధనుర్మాసం పూర్తి కావడంతో సుప్రభాతం సేవను పునరుద్ధరించారు.

Devotees

నిన్న ఒక్క రోజులోనే 76,289 మంది భక్తులు (Devotees) శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, 27,586 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. భక్తుల సమర్పణలతో హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ల నిర్వహణ, అన్నప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసినట్లు వెల్లడించారు.

Devotees

CLICK HERE TO READ శ్రీకోదండ రామాలయం, పంచవటి కాలనీ, మణికొండ

CLICK HERE TO READ MORE

Leave a Reply