RSS| ఆర్ఎస్ఎస్ జన జాగరణ అభియాన్ ప్రారంభం

ఆజాద్ నగర్ లో జన జాగరణ అభియాన్ కరపత్రము
RSS|మక్తల్ , ఆంధ్రప్రభ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నారాయణ పేట జిల్లా మక్తల్ శ్రీ ఉమామహేశ్వరాలయం ఆజాద్ నగర్ లో జన జాగరణ అభియాన్ కరపత్రము,భరతమాత స్టిక్కర్ లను ఆర్ఎస్ఎస్ మక్తల్ ఖండ కార్యవాహ తిరుపతి శ్రీనివాసులు, శ్రీ ఉమామహేశ్వరాలయం అర్చకులు సిద్దరామయ్య స్వామి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్తలు సూర్య ఆంజనేయులు, కావలి వెంకటేష్, పేగుల నర్సింహులు, చిట్యాల ఆంజనేయులు, నాని, కాట్రేవుపల్లి నవీన్, రామకృష్ణ, ప్రవీణ్, సుధీర్, పల్లె అరవింద్ రెడ్డి, దేవరకద్ర రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
