పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు పీఎం నరేంద్ర మోదీ చేరుకున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం బేగంపేటకు చేరుకున్న మోదీ రోడ్డుమార్గంలో హెచ్ఐసీసీకి చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌తో కలిసి రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
వరంగల్‌లో పీఎం మిత్ర పార్కు, జహీరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతం, గుడెబెల్లూర్-మహబూబ్‌నగర్ మధ్య 165 కిలో మీటర్ల నాలుగు వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో నిర్మించిన ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు.
