Electric Shock | వ్యవసాయ పనిలో విషాదం..
Electric Shock | వ్యవసాయ పనిలో విషాదం..
తండ్రీకొడుకుల మృతి…
Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుమ్మగుట్ట మండలం కరిసూరయ్య దొడ్డి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లికి చెందిన ఆనంద్, అతని కుమారుడు తేజ వ్యవసాయ పనుల నిమిత్తం విద్యుత్ మోటార్‌ను దించుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరికీ తీవ్ర షాక్ తగిలింది.
విద్యుత్ షాక్ తీవ్రతకు తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న గుమ్మగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
