Rs. 1.2 crore | నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష

Rs. 1.2 crore | నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష

  • రెండు విద్యా ప్రాజెక్టులకు రూ.1.2 కోట్లు ఆమోదం

Rs. 1.2 crore | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా యాస్పిరేషన్ బ్లాక్(Aspiration block) పరిధిలోని నర్వ మండల అభివృద్ధి ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఈ రోజు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్(Video Conference) ద్వారా సమీక్షించారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్ పాల్గొన్నారు. నారాయణపేట కలెక్టరేట్ వీసీ హాల్‌ నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47వ కార్యదర్శుల సాధికార కమిటీ సమావేశంలో నర్వ బ్లాక్ ఇన్నోవేషన్ క్యాటగిరీ(Innovation Category)లో సమర్పించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై చర్చ జరిగింది.

నర్వ బ్లాక్ ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ఉద్యానవనం, పశువైద్య రంగాల్లో మొత్తం 12 ప్రతిపాదనలను సమర్పించగా, వాటిలో విద్యా రంగానికి సంబంధించిన రెండు ప్రతిపాదనలను ఆమోదించారు. అందులో 1 స్పార్క్– స్కూల్ ప్రోగ్రామ్ ఫర్ ఏ ఐ రెడీనెస్ & నాలెడ్జ్(School Program for AI Readiness & Knowledge) (ప్రాథమిక పాఠశాలల్లో ఏ ఎక్స్ ఎల్ డిజిటల్ ల్యాబ్‌ల స్థాపన), 2. ఎస్ హెచ్ఆర్ఇఇ – పునరుత్పాదక, పర్యావరణ అనుకూల ఆహారం కోసం సోలార్ (నర్వ కేజీబీవీ లో సౌరశక్తితో పనిచేసే వంటగది) కోసం మొత్తం రూ.1.2 కోట్లు(Rs. 1.2 crore) మంజూరు చేయడం జరిగింది.

అనంతరం కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఈ ప్రాజెక్టుల వివరాలను వీసీ సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వర్, డీఈఓ గోవిందరాజులు, యాస్పిరేషన్ బ్లాక్ సమన్వయకర్త బాలాజీ పాల్గొన్నారు.