Dead| కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడు మండలంలోని నెప్పల్లి వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కొమటిగుంట లాకుకు చెందిన సందోలు నరశింహులు, ఉయ్యూరుకు చెందిన పచ్చిగళ్ళ దానియేలు బైక్ పై కంకిపాడు వైపు వస్తున్న సమయంలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. సంఘటన స్థలాన్ని సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, అదనపు ఎస్ఐ తాతాచార్యులు పరిశీలించారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


