Warangal | భద్రకాళి, వేయి స్తంభాల ఆలయాలను దర్శించుకున్న కిషన్ రెడ్డి
Warangal | వరంగల్ కల్చరల్, ఆంధ్రప్రభ : వరంగల్ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సందర్శించారు. కేంద్ర మంత్రికి ఆలయ సంప్రదాయాల ప్రకారం.. ఆలయ కార్య నిర్వహణ అధికారి రామల సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి (Bhadrakali) శేషు శాలువాతో సన్మానించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం హన్మకొండలోని ప్రసిద్ధ వెయ్యి స్థంబాల ఆలయానికి చేరుకున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి (Kishan Reddy) కి పూర్ణకుంభంతో ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆలయ అధికారులు స్వాగతం పలికారు..

ఈసందర్భంగా నందీశ్వరుని (Nandeeshwar) కి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, రుద్రేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

