Returning | రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

Returning | రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

Returning | ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల(Returning Officers) పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా కార్యదీక్షతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలన్నారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలపై పవర్ పాయింట్(Power Point) ప్రజెంటేషన్ ద్వారా వివరించి రిటర్నింగ్ అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైన్లు(Master Trains) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply