ఘనంగా ఎమ్మెల్సీ సత్యం జన్మదిన వేడుకలు..

మునుగోడు, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జన్మదిన వేడుకలను శనివారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సత్యంకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా బి సి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్ గౌడ్, బి సి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లికార్జున్ యాదవ్,బి సి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అనగంటి కృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం సత్యం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి సి సంఘాల నాయకులు గండిచెరువు వెంకన్న గౌడ్, గోసుకొండ మల్లేష్, జక్కలి శ్రీశైలం యాదవ్, కొంపల్లి కిరణ్ గౌడ్, గోపగొని అమరేందర్, గోపగొని దిలీప్, జనగాం శ్రీకాంత్ గౌడ్‌తో పాటు బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply