- గుజరాత్ టార్గెట్ ఎంతంటే
బెంగళూరు వేదికగా ఈరోజు గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో… ఆర్సీబీని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించి.. గుజరాత్ టైటాన్స్ ముందు బెంగళూరు జట్టు ఫైటింగ్ టార్గెట్ సెట్ చేయగలిగింది.
కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి.. ఆదికలోనే షాక్ తగిలింది.6.2 ఓవర్లకే టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ అసమాన పోరాటం చేశాడు. జితేష్ శర్మ(33)తో కిలిసి 5వ వికెట్ కు 52 పరుగుల జోడించాడు. ఆ తరువాత టిమ్ డేవిడ్ తో జటకట్టిన లివింగ్ స్టోన్ 7వ వికెట్ కు 24 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యం క్రియేట్ చేశాడు.
ఈ క్రమంలో, 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసి, అర్ధ సెంచరీతో చెలరేగాడు లివింగ్ స్టోన్. ఇక డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్ విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు సాధించి ఇన్నింగ్స్ లోని ఆఖరి బంతికి ఔటయ్యాడు.
గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లతో అదరగొట్టాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు తీసుకోగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. దీంతో 170 పరుగుల టార్గెట్ తో గుజరాత్ టైటన్స్ ఛేజింగ్ ప్రారంభించనుంది.