అధైర్య ప‌డొద్దు.. అండ‌గా ఉంటాం

జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌
జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ భరోసా

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : కల్తీ మద్యం వ్యవహారంలో ఇటీవల అరెస్ట్ అయిన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి శుక్రవారం వెళ్లి జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు కుటుంబ సభ్యులను కలిశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు మండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అర్హుర్ల జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర నాయకులు జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్రమ కేసుతో జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చిన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారికి అవసరమైన న్యాయ సలహాలతో పాటు భరోసా అందిస్తామని చెప్పారు.

Leave a Reply