చెన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా రవీందర్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కొలిపాక రవీందర్ ఎన్నికయ్యారు.

చెన్నూర్ బార్ అసోసియేషన్ సాధారణ సమావేశం శనివారం నిర్వహించగా, సీనియర్ న్యాయవాదుల విస్తృత చర్చల అనంతరం 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఇందులో ఉపాధ్యక్షుడిగా రమేష్ సెగ్గెం, జనరల్ సెక్రటరీగా మహేష్ కాయిత, జాయింట్ సెక్రటరీగా వికాష్ కుమార్ కచవా, ట్రెజరర్‌గా రాజేష్ బోర్లకుంట ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఎంపికైన నూతన కార్యవర్గానికి తమ పూర్తి సహకారం అందిస్తామని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

Leave a Reply