ఫైనల్లో పోరాడి రన్నరప్‌గా నిలిచిన నిజామాబాద్ జట్టు
ఫైనల్లో పోరాడి రన్నరప్‌గా నిలిచిన నిజామాబాద్ జట్టు
నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 7 (ఆంధ్రప్రభ): బి డివిజన్ టీ20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా క్రికెట్ జట్టు ఫైనల్ వరకు చేరి రన్నరప్‌గా నిలిచింది. టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన కనబరిచిన జట్టు క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వై. శ్రీకర్ రెడ్డి 75 పరుగులతో రాణించగా, అజిత్ రాజ్ దామా 26, ఎం. విక్రాంత్ రెడ్డి 14, కెప్టెన్ జి. విక్రమ్ నాయక్ 12 పరుగులు చేశారు.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖల్సా జట్టు 18.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. నిజామాబాద్ బౌలర్లలో రిత్విక్ ఒక వికెట్ తీశారు.
ఫైనల్లో ఓడినప్పటికీ జట్టు ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ, క్రమశిక్షణ, సమన్వయం ప్రశంసనీయమని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ఎం. వెంకట్ రెడ్డి, కోశాధికారి కె. శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి-కమ్-కోచ్ ఎ. సురేష్ బాబు అభినందించారు.
బి డివిజన్ స్థాయిలో ఫైనల్‌కు చేరుకోవడం జిల్లా క్రికెట్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ త్వరలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
