19kgs | తర్వాత పెరిగేది అవేనా..?
19kgs | తర్వాత పెరిగేది అవేనా..?
19kgs | భారీ షాక్: కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు
భయం పెంచుతున్న అంతర్జాతీయ పరిస్థితులు
త్వరలో పెరగొచ్చు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్?
సామాన్యులపై ప్రభావం: నిత్యావసరాల ధరల మోత
మధ్యతరగతి జీవితంపై పడే భారమైన ప్రభావం
19kgs | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోతున్న వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు. అయితే మున్ముందు ధరల మోత తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ పెంచిన కేంద్రం మున్ముందు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తే వంట గ్యాస్ (డొమెస్టిక్ LPG) వెంటనే పెరగకపోయినా, త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ కూడా మార్పు లేకున్నా క్రూడ్ ధరలు పెరిగితే వాటి రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $126 డాలర్లకు పెరగడంతో ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది.భవిష్యత్తు సూచన: ఎన్నికల అనంతరం, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచడం ద్వారా, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందిఅదే జరిగితే సామాన్యుల పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. ఈ ధరల పెంపుతో నిత్యావసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వాటి ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.

కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు కారణంగా హోటళ్లలో ఆహార పదార్థాలు, టీ, కాఫీ ధరలు పెంచుతున్నారు. గ్యాస్ ధరకే మనకు చుక్కలు కనిపిస్తే ..పెట్రో ధరలు పెరిగితే సామాన్యుడు తట్టుకోగలడా. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మధ్యతరగతి కుటుంబాల జీవనం కష్టతరమయ్యే ప్రమాదం ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగితే రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్థితి అధ్వానంగా తయార్యే చాన్స్ ఉంది.

CLICK HERE TO READ MORE ఇరాన్ పై దాడులు.. పుతిన్ కఠిన హెచ్చరిక
