శాంతి విద్యనికేతన్ స్కూల్లో సైన్స్ ఫేర్..

శాంతి విద్యనికేతన్ స్కూల్లో సైన్స్ ఫేర్..
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంఈఓ మత గురువులు
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ ప్రధమ లక్ష్యం
తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ రోజువారి పాఠశాలకు పంపించాలి
ఎంఈఓ శాంతారావు వికాస్ జనరల్ మోస్ట్ రెవరెండ్ ఫాదర్ తప్పెట శౌరి, జేసుప్రసాద్,అరుణ్
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలో శాంతి విద్య నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల్లో సైన్స్ పేర్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆళ్లపల్లి మండల విద్యాధికారి కొమరం శాంతారావు,ఖమ్మం రోమన్ క్యాథలిక్ మిషన్ డయాసిస్ వికార్ జనరల్, మోస్ట్ రెవరెండ్ ఫాదర్ తప్పేట శౌరి, స్థానిక పునీత పేతురు పౌలుఆర్సియం చర్చి విచారణ గురువులు సిద్దెల జేసు ప్రసాద్ ఎస్జెసి, గబ్బెట అరుణ్ కుమార్, విజయరావు, పౌల్ రాజు, ఖమ్మం జీవన్ జ్యోతి స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ జయంత్ ఆంథోనీ, మాజీ వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, శాంతి విద్యనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం సిస్టర్ మహిత,సుపరియార్ సిస్టర్ ప్రశాంత కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎంఈఓ కొమరం శాంతారావు, వికారి జనరల్ ఫాదర్ తప్పేట శౌరి, జీసు ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లోని ఉన్నత శిఖరాలు పదవులను అధిరోహించాలంటే క్రమశిక్షణ ప్రధమ లక్ష్యంగా, రోజువారీగా పాఠశాలకు రావడంతో విద్యార్థులు పుస్తక జ్ఞానంతోనే పరిమితం కాకుండా, ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో గొప్పమేధావి, విద్యావేత్తలుగా ఎదుగుతారన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన వాతావరణ సూచిక, భూమ్యాకాశం ఖగోళ మోడల్ పర్యావరణ పరిరక్షణ, గణిత విభాగం పద్ధతి, వెజిటేరియన్, సాంకేతిక ప్రదర్శన స్టాల్లను ముఖ్య అతిధులను ప్రభుత్వ వైద్యులు సంఘమిత్ర, సెక్రెటరీ వల్లాల శిరీషతో పాటుగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.సుమారు100కుపైగా ప్రదర్శన ప్రయోగాత్మక నమూనాలను విద్యార్థులు స్పష్టంగా వివరించారు.
ఈసందర్భంగా పాఠశాల ఎచ్ఎమ్ సిస్టర్ మహిత పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తమ విద్యాసంస్థలు నిరంతరంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ సైన్స్ ఫేర్‌ను తిలకించేందుకు, మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల కేజీబీవీ పాఠశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావడం అభినందనీయమన్నారు. సైన్స్ పేర్ లో పాల్గొన్న విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి విజయవంతం చేయడంలో శాంతి విద్యనికేతన్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అహర్నిశలుగా కృషిచేయడం గర్వకారణమన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది సయ్యద్ షమీమా, జ్యోతి, సహన, శిరోమణి, సింధు, వెన్నెల,ఆయాలక్ష్మి,కసనబోయిన నరేష్, శివ,బూరుగడ్డ వెంకటేశ్వర్లు సంక కిరణ్, పలువురు విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
