కేంద్రమంత్రిని కలిసిన ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి
కేంద్రమంత్రిని కలిసిన ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డిలో పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ కారిడార్) కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ను దేశ రాజధాని ఢిల్లీలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చెయటమే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాలలో యువతకి, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వ, పైవేటు రంగాలు సంఘటితంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కి విన్నవించినట్టు ఆయన తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యావంతులైన యువకులు, మహిళలకి కొదవ లేదని, వారిని భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నెలకొల్పితే ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరిగి అభివృద్ధి చెందిన ప్రాంతంగా కామారెడ్డి ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేసి *సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు ఇతర విభాగాల వారితో సమగ్ర విచారణ చేపడతామని మంత్రి సూచించినట్టు తెలిపారు.
