Raghava Lawrence Hints at Political Entry | రాజకీయాల్లోకి ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
Raghava Lawrence Hints at Political Entry | రాజకీయాల్లోకి ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
Raghava Lawrence Hints at Political Entry | అభిమానుల నిర్ణయంపైనే నా రాజకీయ భవిష్యత్తు
తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ ప్రచారంపై చర్చ
Raghava Lawrence Hints at Political Entry | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సినీ నటి, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను నిజాయితీగా ఉన్నాను… నన్ను మీరంతా రమ్మంటే రాజకీయాల్లోకి వస్తా. లేదంటే రాను… అభిమానులే నన్ను గైడ్ చేయండి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఆయన పేరు తరచుగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేకాకుండా విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ నుంచి, ఇటీవల విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
లారెన్స్ ప్రకటనతో ఆయన అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
