192 సీట్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
192 సీట్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి: ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ, ఎన్‌సీవీటీ అనుబంధ ప్రైవేట్ ఐటీఐలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ విద్యా సంవత్సరానికి ఫిట్టర్ (2 సంవత్సరాలు), ఎటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) ట్రేడ్లు మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ (1 సంవత్సరం), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (1 సంవత్సరం), ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్ (1 సంవత్సరం), వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ (ఎఫ్ఈఎం) (2 సంవత్సరాలు), సీఎన్‌సీ మిషినింగ్ టెక్నీషియన్ (2 సంవత్సరాలు), మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (2 సంవత్సరాలు) కోర్సుల్లో మొత్తం 192 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, దరఖాస్తులను జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల మెమో వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
వివరాల కోసం https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, మరిన్ని వివరాలకు 8500465034 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
