బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం

బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం

కోడూరు, ఆంధ్రప్రభ : వేసవికాలంలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయమని అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. బుధవారం కోడూరు ప్రధాన సెంటర్లో జనసేన పార్టీ యువ నాయకుడు బచ్చు వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు.

ఎండల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం మంచి విషయం అని, ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. చలివేంద్రం ప్రారంభించిన తొలి రోజు మజ్జిగ పంపిణీ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కోడూరు మండలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మండలి అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply