Public service | గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా

Public service | గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా

రేండ్లగూడ సర్పంచి అభ్యర్థి జయశీల

Public service | జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : ఓట్లు వేసి గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తానని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడ సర్పంచ్ అభ్యర్థి ముల్కల్ల జయశీల రాజారావు అన్నారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆమె ఈ రోజు గ్రామంలోని పలు వాడల్లో ఇంటింటికి తిరుగుతూ టీవీ రిమోట్(TV remote) గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

నిరంతరం ప్రజాసేవే(public service) పరమావధిగా పనిచేస్తానని, గ్రామంలో అపరిస్కృతంగా ఉన్న మురుగునీటి కాలువలను, అన్నీ వాడ‌ల్లో సీసీ రోడ్లను వేయించడానికి పాటుపడతానని ఆమె చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజల వెంటే ఉండి, ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతో మాట్లాడి తీర్చడానికి ప్రయత్నిస్తానని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply