కాంగ్రెస్ బాకీ వివ‌రాలు తెలుసుకోండి

కాంగ్రెస్ బాకీ వివ‌రాలు తెలుసుకోండి

వ‌రంగ‌ల్‌, ఆంద్ర‌ప్ర‌భ : స్థానికి సంస్థ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వినూత్నరీతిలో ప్ర‌చారాల‌కు నాయ‌కులు శ్రీ‌కారం చుడుతున్నారు. న‌ర్సంపేట(Nervous) నియోజ‌క‌వ‌ర్గం నెక్కొండ మండలంలోని బీఆర్ఎస్(BRS) రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డును పార్టీ శ్రేణులతో కలిసి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) ప్ర‌చారం చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింద‌ని, ఆనాడు హామీలు ఇచ్చి మోసం చేసింద‌ని, వాటి వివ‌రాలు బాకీ కార్డులో ఉన్నాయ‌ని అన్నారు. ఎన్నికల స‌మ‌యంలో గ్రామాల్లోకి వ‌చ్చిన కాంగ్రెస్ నాయ‌కుల‌(Congress leaders)ను నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు. బ‌స్సుల్లో, ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.