పంచాయతీ భవన పనులు త్వరగా పూర్తి చేయాలి..

జైనూర్, ఆంధ్రప్రభ ; నూతనంగా నిర్మిస్తున్న పవర్ కూడా గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల అభివృద్ధి అధికారి సుధాకర్ రెడ్డి కోరారు. ఆయన సోమవారం పవర్ గూడ సర్పంచ్ తొడసం రాజేందర్ తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న పవరగూడ గ్రామపంచాయతీ భవన పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని పనులు త్వరగా పూర్తీ అయ్యేలా చూడాలని సర్పంచ్ రాజేందర్ కు ఎంపీడీవో కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుడసం రాజేందర్ తో పాటు పంచాయతీ కార్యదర్శి భరత్, కరోబార్ ఉయిక జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
