suicide | తండ్రి మందలించాడని కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య

suicide | తండ్రి మందలించాడని కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య
suicide | ఉట్నూర్, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వస్తున్నాడని తండ్రి మందలించినందుకు క్షణికావేశంతో కాంట్రాక్ట్ ఉద్యోగం(Contract job) చేసే కొడుకు ఆత్మహత్య(suicide) చేసుకున్న సంఘటన అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఇవాళ తెలిపిన వివరాల ప్రకారం హస్నాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ బాహు రావు కుమారుడు రాథోడ్ సాయికిరణ్(27) వైద్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడన్నారు.
గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి(government hospital)లో కాంట్రాక్టు ఉద్యోగ పని చేసి నాలుగు నెలల క్రితం ఇంటికి వచ్చాడని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగ పని చేస్తూ రోజు మద్యం తాగి ఇంటికి రావడంతో తండ్రి మందలించినందుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

కొడుకు సాయికిరణ్ మందు తాగిన విషయం గమనించి చికిత్స నిమిత్తం ఓటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్యులు పరీక్షించడంతో తీసుకోవచ్చేటప్పుడు మార్గం మద్యంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు మృతిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. తండ్రి బాహురావు ఫిర్యాదు మేరకు ఆసుపత్రికి వెళ్లి సాయికిరణ్ మృతదేహానికి పంచినామా నిర్వహించి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
