ACCIDENT |లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు

  • డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
  • ప్రయాణికులు సురక్షితం

ACCIDENT | చాగలమర్రి, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలోని మద్దూరు గ్రామ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు బస్సు లారీని ఢీ కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. ఏపీ 39, డబ్ల్యూ సీ 2024 నెంబర్ గల పీఆర్ ఎల్ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్నలారీని అతివేగంతో ఢీ కొట్టిన సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో అందులోని ప్రయాణికులు కొందరు భయాందోళన చెందారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ట్రావెల్ ప్రైవేట్ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకొని గాయ‌ప‌డిన డ్రైవ‌ర్‌ను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగంతో వెళ్లడం, నిద్రమత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply